Posts

Showing posts from June, 2020

పద్యపూరణలు

Image
పద్య పూరణలు (అవధానం) తేది 19-06-2020,  శుక్రవారం  పూరిస్తున్నవారు :  శ్రీమతి చుక్కాయపల్లి శ్రేదేవి గారు  నిర్వహణ :శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు అంశాలు - పృచ్ఛకులు  1 సమస్య - పద్మ చిగురాల గారు  2 అంత్యాద్యక్షరి - జ్ఞాన ప్రసూనా శర్మ గారు  3 దృశ్యం - లక్ష్మీమదన్ గారు  4 దత్తపది - లక్ష్మీ పద్మజ గారు  5 న్యస్తాక్షరి - మణిమాల గారు  6 అశువు - గాయత్రి గారు  7 నిషిద్ధాక్షరి - సంధ్యారాణి గారు  8 వర్ణన - హరిణా పవన్ గారు నేటి 62వ ఆన్లైన్ అష్టావధానానికి సుస్వాగతం ప్రార్థన అందెలు ఘల్లని మ్రోగగ చిందులు వేయు చును‌ కొంటె చేష్టలతోడన్ విందారగించు వెన్నుని సుందరమౌ మోముగాంచు శుభమెన్నటికో! కడవల వెన్నల గ్రోలుచు నడవలలో‌ నాట్యమాడు‌ నవ్వుల రేడున్ సుడివడి తిరిగెడి నడకల గడబిడలే గాంచి మురియు సంతసమెపుడో! సమస్య  పద్మ చిగురాల గారు  అవధాని గారికి నమస్కారం🙏🏻🌹 నా పేరు పద్మ చిగురాల... అంశం సమస్య: కదలకయున్నచో పెరుగు కండలు క్రొవ్వును దేహమందునన్..!            . . 🙏🏻.. వదలక సోమరుల్ బహుళ వాంఛలు గల్గి నిరంతరంబుగన్ కొదవయెలేన...