Posts

Showing posts from May, 2019

మాడుగుల భాస్కర్ శర్మ పద్యపూరణలు - 2

Image
పద్యపూరణలు - 10 తేది: 31-05-2019 ఈ రోజుపద్యపూరణలు... చేయువారు మాడుగుల భాస్కర్ శర్మ గారు సమన్వయం గోగులపాటి కృష్ణమోహన్ అంశాలు 1.నిషిద్దాక్షరి...గోగులపాటి కృష్ణ మోహన్ గారు 2.సమస్య... రామక కృష్ణ మూర్తి గారు 3.దత్తపది... సింగీతం నరసింహారావు గారు 4.వర్ణన... వేదాంతం సురేష్ బాబు గారు 5.ఛందోభాషణ... మాడుగుల మురళీధరశర్మ గారు 6 న్యస్థాక్షరి... సరస్వతీ రామశర్మగారు 7.దృశ్యం... పద్మజారంగరాజుగారు 8.ఆశువు... సరస్వతీ రామశర్మగారు ఓం శ్రీ మహా గణపతయేనమః ఓం శ్రీ మహా సరస్వత్యైనమః శ్రీ గురుభ్యోనమః ప్రభువు గణాధినాథునిట ప్రార్థన జేతు నవిఘ్నకర్తగన్ సభలకు ముందు పూజగొని సత్ఫలమీయగ సాటి యెవ్వరీ యిభముఖ దేవతాగ్రణికి నిచ్చెద జోతలు భక్తితోడుతన్ ఉభయ సతీప్రయుక్తుడుగ బుద్ధియు సిద్ధియు తోడు నిల్వగన్ వీణాపాణికి బ్రహ్మసు రాణికి కవితార్థమిచ్చు రాజీవముఖీ వాణికృపాణి కి పన్నగ వేణికి నావందనములు విధిగన్ గొనగన్ ... మాడుగుల భాస్కర శర్మ 1) అంశం.....నిషిధ్ధాక్షరి గోగులపాటి కృష్ణ మోహన్. స రి గ మ అక్షరాలు. నిషేధం తో సంగీతం యెక్క.విలువ తెలుపగలరు... స్వేచ్ఛా ఛందం పూరణ: నిషిద్ధాక్షరి పాటల...

మంచినీళ్ళ సరస్వతి రామశర్మ పద్యపూరణలు

Image
పద్యపూరణలు... 9వ రోజు చేయువారు: మంచినీళ్ళ సరస్వతి రామశర్మ సమన్వయం: గోగులపాటి కృష్ణమోహన్ అంశాలు 1.అంత్యాదక్షరి 2.సమస్య: సింగీతం నరసింహారావు గారు 3.దత్తపది: గోగులపాటి కృష్ణమోహన్ గారు, సింగీతం నరసింహారావు గారు 4.వర్ణన: రామక కృష్ణమూర్తి గారు 5.ఛందోభాషణ: మాడుగుల భాస్కర శర్మ గారు 6 న్యస్థాక్షరి: చీదెళ్ళ సీతాలక్ష్మి గారు 7.దృశ్యం : సింగీతం సంధ్యారాణి గారు 8.ఆశువు: గుళ్ళపల్లి కాంతికృష్ణ గారు 🙏🌹🙏🌹 🙏🌹🙏 శ్రీగణాధిపతయేనమః శ్రీసరస్వత్యై నమః లక్ష్మీనృహింహ మమదేహి కరావలంబం.. 🙏🙏🙏 శ్రీకారముగాసాగగ సాకారమునందజేయు సాహిత్యముకై ప్రాకటముగతొలిపూజల జేకొను,గణనాథుపదము,చేమోడ్పులివే. 🙏🙏🙏 1) అంశం:వర్ణన పృచ్ఛకుడు: డా.రామక‌ కృష్ణమూర్తి గ్రీష్మ ఋతువును మీ స్వేచ్ఛా వృత్తంలో వర్ణించండి పూరణ: వర్ణన ఏమని జెప్పగ తలచెద నీమంటలనార్పవశమె నేడిట తలచన్ ఏమాయాజాలమిదో ఏ మాత్రమునోపకుంటి మెటు పోదుమొకో... 2) అంశం... ఆశువు గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ వేగంగా వెళుతున్న వాహనం . అందులో కూర్చున్న ప్రయాణీకుల ఆలోచనలు... 🙏🙏🙏🙏 పూరణ: వర్ణన వేగమనగజూడ వేడిగా తలచేరు పడుచు జనులకెల...

శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్యపూరణలు - 4

Image
పద్యపూరణలు - 8 తేది: 29-05-2019 శతాధికష్టావధానవేదిక ఈ రోజు పద్యపూరణలు... చేయువారు: శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు అంశాలు: 1.నిషిద్దాక్షరి: గోగులపాటి కృష్ణమోహన్ గారు 2.సమస్య : అష్టకాల విద్యాచరణ్ గారు 3.దత్తపది: సింగీతం నరసింహారావు గారు 4.వర్ణన : గోగులపాటి కృష్ణమోహన్ గారు 5.ఛందోభాషణం: జ్ఙానప్రసూన శర్మ గారు 6 న్యస్థాక్షరి: సరస్వతి రామశర్మ గారు 7.దృశ్యం : సింగీతం సంధ్యారాణి గారు, లక్ష్మీ మదన్ గారు 8.ఆశువు : రామక కృష్ణమూర్తి గారు సమన్వయం గోగులపాటి కృష్ణమోహన్ శుభాశంసలతో.... నిరతము సోత్సాహినియై వరపద్యములల్లుచున్న  భాస్వన్మహిళా ! సరములవోలిక నల్లుచు చిరకీర్తిగ వెల్గుమింక శ్రీయుతదేవీ! డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ. కవుల సమూహానికి నమస్సులు ప్రార్ధన: ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీ సరస్వత్యై నమః ఓం శ్రీ హయగ్రీవాయ నమః శ్రీరంగాపుర సీమయందు జనులశ్రేయంబు పెంపొంద నో రారంగానిను రంగరంగయని చేరంగన్ భవత్పాదముల్ కోరంగాజను భక్తకోటికిలలో కోలాహలంబై కృపా పూరంబౌ భవదృక్కులన్ నిలుపుమా !పుణ్యిత్ములన్ జేయుమా 1) అంశం: వర్ణన గోగులపాటి కృష్ణమోహన్ హనుమత్ జయంతి సం...

అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారి పద్యపూరణలు

Image
ఈ రోజు పద్యపూరణలు... చేయువారు: అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ  గారు సమన్వయకర్త గోగులపాటి కృష్ణమోహన్ అంశాలు: 1.నిషిద్దాక్షరి : చీదెళ్ళ సీతాలక్ష్మి గారు 2.సమస్య: పద్మ చిగురాల గారు 3.దత్తపది: రామక కృష్ణమూర్తి గారు 4.వర్ణన: సరస్వతి రామశర్మ గారు 5.ఛందోభాషణ: మాడుగుల మురళీధర్ శర్మ గారు 6.అంత్యాదక్షరి : జ్ఙానప్రసూన శర్మ గారు 7.దృశ్యం : మాడుగుల భాస్కర్ శర్మ గారు 8.ఆశువు:చుక్కాయపల్లి శ్రీదేవి గారు ప్రార్థన  ! 🍁🍁🍁 అల పెద్దన్న నుతించినట్టిదగు బాల్యంబైన నీ లీల,నా లలితంబైన యెడంద నిండునటులన్ లాలించి బోధించె ని ర్మలశీలుండగు తాతపాదుడల తన్మాధుర్యమున్ గ్రోలి నే పలుకన్నేర్చితి నా నుతిన్ గొనుము విభ్రాజద్గణాధీశ్వరా! ప్రార్థన! 🍁🍁🍁 అక్షరమాలావర్ణ్యామ్ వీక్షణవిన్యస్తసౌధవిద్యాత్మామ్ ఐక్షవచాపాం వందే సాక్షాత్కామేశమానసాం హంసీమ్! అంశం:దత్తపది పృచ్ఛకుడు: డా.రామక కృష్ణమూర్తి మతి,గతి,క్షితి,రతి-మాతృదేశ వైభవ వర్ణన-మత్తేభ వృత్తంలో చెప్పగలరు 1) పూరణ:  దత్తపది: 🍁🍁🍁 మతిమన్మాతృధరాభిరక్షకులు త్వన్మాహాత్మ్యసంస్థాపకుల్ గతిమద్భద్రసుకృత్యవర్ధనులు నీ కాం...

శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్యపూరణలు - 3

Image
పద్యపూరణలు... తేది 27-05-2019, సోమవారం చేయువారు: శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు సమన్వయం: గోగులపాటి కృష్ణమోహన్ గారు అంశాలు: 1.నిషిద్దాక్షరి: అష్టకాల విద్యాచరణ్ గారు 2.సమస్య : రామక కృష్ణమూర్తి గారు 3.దత్తపది:  మాడుగుల భాస్కర శర్మ 4.వర్ణన : గోగులపాటి కృష్ణమోహన్ గారు 5.ఛందోభాషణ: గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారు 6 న్యస్థాక్షరి: చీదెళ్ళ సీతాలక్ష్మి గారు 7.దృశ్యం : లక్ష్మీ మదన్ గారు 8.ఆశువు : రమాదేవి కులకర్ణి గారు శ్రీదేవికి అభినందనలు! 🌸🌸🌸🌸🌸🌸🌸 నిరతము కవితాసాధన వరముగ చేపట్టినావు పద్యవిరచనన్ చిరకీర్తినలరుమమ్మా! వరపూరణవిద్యలందు  వాక్ శ్రీదేవీ! ఆశీస్సులతో....... డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ. 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీ సరస్వత్యై నమః ఓం శ్రీ హయగ్రీవాయ‌ నమః సతతము నామ సంస్మరణ  శ్వాసగ ధ్యాసగ నిత్యకృత్యమై గతియిక నీవెయంచు తమకై పరిచర్యలొసంగి భక్తితో నతులిత దివ్యతేజముల యందున నామది‌ నిల్పియుంటి నా జతయును దైవమున్ గురుడు సర్వము నీవనుకొంటి మాధవా 1) అంశం:సమస్య పృచ్ఛకుడు: డా.రామక కృష్ణమూర్తి మగని దూలనాడి మాన్యయయ్...

ముత్యంపేట గౌరిశంకర శర్మ పద్యపూరణలు

Image
తేది : 26-05-2019, ఆదివారం పద్యపూరణలు చేయువారు: అవధాని బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ  గారు అంశాలు: 1) వర్ణన చీదెళ్ళ సీతాలక్ష్మి గారు 2) సమస్య సరస్వతి రామశర్మ గారు 3) దత్తపది రామక కృష్ణమూర్తి గారు 4) అశువు గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారు 5) నిషిద్ధాక్షరి: సింగీతం నరసింహారావు గారు 6) ఛందోభాషణం: చుక్కాయపల్లి శ్రీదేవి గారు 7) అంత్యాదక్షరి: 8) శ్లోకానువాదము:  గోగులపాటి కృష్ణమోహన్ గారు, అమరవాది రాజశేఖర శర్మ గారు సమన్వయం గోగులపాటి కృష్ణమోహన్ స్వాగతవచనము అవధానిప్రశంసా! 🌸🌸🌸🌸🌸 గౌరీశంకరకరుణా పాత్రీకృతసాహితీవిభాస్వత్కవయే గౌరీశంకరనామ్నే స్వస్త్యస్తు నవావధానిమణయే నిత్యమ్! అభినందనపురస్సరమ్.... డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ. 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 శ్రీ వినాయక!గణనాధ!చిద్విలాస! నేటియష్టావధానమ్ము మేటిగాను నీవెనడిపింపగాజేసి నిలిచిచెంత భయముతొలగించి నాకిమ్ము జయముదేవ!... ---- ముత్యంపేట గౌరిశంకర శర్మ 1) అంశం.వర్ణన డా.చీదెళ్ల సీతాలక్ష్మి నేటి భోజన వ్యవస్థ..అవస్థ ను స్వేచ్ఛా ఛందము లో వర్ణించండి.... పూరణ : వర్ణన ఎచ్చట చూసినన్ భఫులు ఏర్పడ మింగగలే...

అయాచితం నటేశ్వర శర్మ గారిచే పద్యపూరణలు

Image
 బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ  గారిచే పద్యపూరణలు  ఈ రోజు పద్యపూరణలు...4 వ రోజు చేయువారు: అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ  గారు సమన్వయం గోగులపాటి కృష్ణమోహన్ అంశాలు: 1.నిషిద్దాక్షరి : గోగులపాటి కృష్ణమోహన్ గారు 2.సమస్య: రామక కృష్ణమూర్తి గారు 3.దత్తపది: చీదెళ్ళ సీతాలక్ష్మి గారు 4.వర్ణన: సింగీతం నరసింహారావు గారు 5.ఛందోభాషణ 6.అప్రస్తుతం  7.దృశ్యం : సరస్వతి రామశర్మ గారు 8.ఆశువు.చుక్కాయపల్లి శ్రీదేవి గారు అవధానిగారికి నమస్కారం! సరసకవిత్వతత్త్వ రససాగరపారగసత్కవీంద్ర! మీ  సురుచిర పద్య వైభవము సొంపునుగూర్చెసమూహమందునన్  అరయగమాదృశాదులకునాద్యులుమీరు సు సాహితీ రస  స్వరములుమీకలమ్మునను సంస్కృతిదెల్పెభవద్గలమ్ము .హే నటే  శ్వర!యవధానవర్య! కవి సంస్తుతిపాత్ర!నమోస్తు!సత్కృతీ!...నమస్సులతో... భవదీయుడు.  --- ముత్యంపేటగౌరీ శంకర శర్మ. ప్రార్థన! అయాచితం నటేశ్వర శర్మ శ్రీమత్సంస్కృతభారతీయకవితాసిద్ధాంతహృద్వాసిత  క్షేమానందమయస్వరూపమున మచ్చేతోవికాసమ్మువై  ధీమాన్యంబగు కావ్యమా...

శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి పద్యపూరణలు 2

Image
పద్యపూరణలు...2 తేది: 24-06-2019, శుక్రవారం పూరణ చేయువారు:  శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు సమన్వయం గోగులపాటి కృష్ణమోహన్ అంశాలు: 1.నిషిద్దాక్షరి: గోగులపాటి కృష్ణమోహన్ 2.సమస్య : గోగులపాటి కృష్ణమోహన్ 3.దత్తపది:రామక కృష్ణమూర్తి గారు 4.వర్ణన: రమాదేవి కులకర్ణి గారు 5.ఛందోభాషణ: సరస్వతీ రామశర్మ గారు 6 న్యస్థాక్షరి: సరస్వతీ రామశర్మ గారు 7.దృశ్యం : లక్ష్మీ మదన్ గారు 8.ఆశువు : సింగీతం నరసింహారావు గారు 1) అంశం- నిషిద్ధాక్షరి గోగులపాటి కృష్ణమోహన్ హిమాలయములు. నిషిద్ధాక్షరము - మ ఛందస్సు - కందము పూరణ నిషిద్ధాక్షరి తెల్లని కాంతుల నగములు యల్లన భారతికి నుదుట నలరెడు నగయై చల్లని శశికిరణంబై వెల్లువయౌ సంతసముల వేడుకనొసగున్ 2) అంశం: సమస్య గోగులపాటి కృష్ణమోహన్ సమస్యాపూరణం వర్షధారలెల్ల హర్షము గూర్చగా వీడు వీడు వీడ, వాడు వీడ పొట్టకూటి కొరకు తట్టబట్టువారు పల్లెబాట సాగిరుల్లసముగ వీడు.....విడవడం; వీడు...పట్టణం 3) అంశం: దత్తపది డా.రామక కృష్ణమూర్తి జయసుధ, జయప్రద, జయలక్ష్మి, జయచిత్ర-భారతా...

శ్రీ మాడుగుల భాస్కర శర్మ పద్య పూరణలు

Image
శ్రీ మాడుగుల భాస్కర శర్మ గారి పద్య పూరణలు తేది : 23-05-2019  23-5-2019గురువారం 🙏🙏🙏🙏🙏🌹🌹 ఈ రోజు పద్యపూరణలు... చేయువారు: శ్రీ మాడుగుల భాస్కర శర్మ గారు అంశాలు: 1.నిషిద్దాక్షరి: చుక్కాయపల్లి శ్రీదేవి గారు 2.సమస్య : జ్ఙానప్రసూన శర్మ  గారు 3.దత్తపది: రమాదేవి కులకర్ణి గారు 4.వర్ణన : సరస్వతి రామశర్మ గారు 5.ఛందోభాషణ: శ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ గారు 6 న్యస్థాక్షరి: గోగులపాటి కృష్ణమోహన్ గారు 7.దృశ్యం : రామక కృష్ణమూర్తి గారు 8.ఆశువు : సింగీతం నరసింహారావు గారు 9) అప్రస్తుతం: మాడుగుల నారాయణ మూర్తి సమన్వయం గోగులపాటి కృష్ణమోహన్ శ్రీ మాడ్గుల కులోత్పన్న భాస్కరాఖ్యమహాకవే! పద్యపూరణసందర్భే జయోస్తు!తవసర్వదా!!... -ముత్యంపేట గౌరిశంకర శర్మ గారు శ్రీ మాడుగుల భాస్కర శర్మ గారి ఆరంభ పలుకులు ఓం శ్రీ మహాగణపతయేనమః శ్రీ జ్ఞాన సరస్వత్యైనమః శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరాభ్యాం నమః కవులకు కవి గణనాథా భవునకుపార్వతి కి ముద్దు పట్టివి గద యీ కవనమునకాది నీవే యవధానము చేయుశక్తి నందించవయా! శ్రీ వాణీనగజాత్మజా వరమహాశీర్వాద కాంక్షామదిన్ భావోత్కృష్ట ఫలమ్ములీయ ...

చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్య పూరణలు

Image
తేదీ 21-5-2019బుధవారం సాయంత్రం7-30ని.... ఈ రోజు పద్యపూరణలు... చేయువారు: శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు సమన్వయం: గోగులపాటి కృష్ణమోహన్ గారు అంశాలు: 1.నిషిద్దాక్షరి: మాడుగుల భాస్కర్ శర్మ గారు 2.సమస్య : రామక కృష్ణమూర్తి గారు 3.దత్తపది: సింగీతం నరసింహారావు గారు 4.వర్ణన : లక్ష్మీ మదన్ గారు 5.ఛందోభాషణ: మాడుగుల మురళీధర్ శర్మ గారు 6 న్యస్థాక్షరి: సరస్వతీ రామశర్మ గారు 7.దృశ్యం : గోగులపాటి కృష్ణమోహన్ గారు 8.ఆశువు : మల్లావఝ్ఝుల చంద్రశేఖర శర్మ గారు ఇదొక ప్రయత్నం మాత్రమే... పెద్దలు అభినందించి ఆశీర్వదించగలరని మనవి.         ప్రార్థన  ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీ సరస్వత్యై నమః సరస్వతీ ప్రార్థన వందనమమ్మా పదముల చందనముల నలది పద్య‌ సౌందర్యముచే సుందరి నిను సేవించెద వందల దీవెనలొసంగు వాణీ కరుణన్  వర్ణన లక్ష్మి మదన్ అవధాని గారికి నమస్కారములు! లక్ష్మణుడు పర్ణశాల చుట్టూ రేఖ గీసి సీతమ్మ ను దాట వద్దని చెప్పినప్పుడు ..వారిద్దరి మధ్య  సంభాషణ నీ వర్ణించండి! సీత భూజాత పావన చరిత నిలన గీత దాటెను చింతన కీడు మరచి మాత ధరణి...