శ్రీ మాడుగుల భాస్కర శర్మ పద్య పూరణలు

శ్రీ మాడుగుల భాస్కర శర్మ గారి పద్య పూరణలు
తేది : 23-05-2019 



23-5-2019గురువారం
🙏🙏🙏🙏🙏🌹🌹

ఈ రోజు పద్యపూరణలు...
చేయువారు: శ్రీ మాడుగుల భాస్కర శర్మ గారు

అంశాలు:

1.నిషిద్దాక్షరి: చుక్కాయపల్లి శ్రీదేవి గారు

2.సమస్య : జ్ఙానప్రసూన శర్మ  గారు

3.దత్తపది: రమాదేవి కులకర్ణి గారు

4.వర్ణన : సరస్వతి రామశర్మ గారు

5.ఛందోభాషణ: శ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ గారు

6 న్యస్థాక్షరి: గోగులపాటి కృష్ణమోహన్ గారు

7.దృశ్యం : రామక కృష్ణమూర్తి గారు

8.ఆశువు : సింగీతం నరసింహారావు గారు

9) అప్రస్తుతం: మాడుగుల నారాయణ మూర్తి


సమన్వయం
గోగులపాటి కృష్ణమోహన్


శ్రీ మాడ్గుల కులోత్పన్న
భాస్కరాఖ్యమహాకవే!
పద్యపూరణసందర్భే
జయోస్తు!తవసర్వదా!!...
-ముత్యంపేట గౌరిశంకర శర్మ గారు


శ్రీ మాడుగుల భాస్కర శర్మ గారి ఆరంభ పలుకులు

ఓం శ్రీ మహాగణపతయేనమః
శ్రీ జ్ఞాన సరస్వత్యైనమః
శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరాభ్యాం నమః


కవులకు కవి గణనాథా
భవునకుపార్వతి కి ముద్దు పట్టివి గద యీ
కవనమునకాది నీవే
యవధానము చేయుశక్తి నందించవయా!

శ్రీ వాణీనగజాత్మజా వరమహాశీర్వాద కాంక్షామదిన్
భావోత్కృష్ట ఫలమ్ములీయ ఘన సద్భాగ్యమ్ముగాదోచగన్
యీవేళన్ కవిమిత్ర సోదర మనోభీష్టమ్ము కై నేను మీ
సేవాతత్పరుడైన భాస్కరుడ నా చేయూతగా నిల్వుడీ


అంశం: దృశ్యం:-
పృచ్ఛకుడు:డా.రామక కృష్ణమూర్తి





పై దృశ్యాన్ని మీ స్వేచ్ఛా వృత్తంలో వర్ణించగలరు

పూరణ:-
పచ్చదనమాపు సూర్యుని వెచ్చదనము
హరితమంతయు రవికర భరిత మగును
పరగ భూగోళ మంతసంభరితమయ్యె
తామరాకున బిందువై తరలివచ్చె

అంశం: నిషిద్ధాక్షరి:-
చుక్కాయపల్లి శ్రీదేవి

వ,న,జ,డ లను నిషేధిస్తూ
వేసవిలో వాన కురిసినపుడు కలిగే ఆనందాన్ని వర్ణించండి

పూరణ:-
ఉష్ణసీమలోమేఘాలుయులికి నంత
సంబరముభూమి పైగవ సాధువులకు
కుక్కనక్కల కళ్యాణ చక్కదనము
సింగణుల దివ్య సంతోష సిద్ధి గలిగె


అంశం ; న్యస్థాక్షరి:-
గోగులపాటి కృష్ణమోహన్

హి - ఒకటవ పాదం మొదటి
.మ - రెండవ పాదం  మూడవ
.గి -  మూడవ పాదం   తొమ్మిదవ
 రీ - నాలుగవ పాదం ఐదవ
అక్షరాలలో... చంపకమాల వృత్తంలో
ఆకాశ గంగను వర్ణించండి..

పూరణ:-
హిమగిరియాత్రలోసుఖములీప్సిత స్వప్నములెల్లతీర్చగా  సుమమమతానురాగములసుందరపద్యముగంగయైధరన్ క్రమముగజాలువారెగిరిగౌరికితోడుగనక్కస్థానమున్  నమకమురీతిమంత్రరసనాదమువీనులవిందుజేయగన్


అంశం ..వర్ణన
సరస్వతీ రామశర్మ

కృష్ణ కుచేల స్నేహం వర్ణించండి

పూరణ:-
చిన్ననాటి ప్రేమ జీవితమంతయు
నిండియుండు భేదముండకుండ
పేదధనికవర్గ ప్రేలాపనలు లేని
యాసుదామ కృష్ణులమరులైరి


అంశం : దత్తపది
రమాదేవి కులకర్ణి

పవన్ , జగన్  ,మోడీ ,బాబు
పదాలను ఉపయోగించి
ఆటవెలదిలో రాజకీయ చదరంగాన్ని  హాస్యంగా వర్ణించండి

పూరణ:-
చంపవనుచు నిన్ను సాగిలబడినారు
రాజ్యమోడిగెలిచె ! రాజ!గనుము
యీ సుబాబులుకడ నీడయే లేదాయె
ఆ యుపవనమందు నచట శాంతి


అంశం: సమస్య
జ్ఙాన ప్రసూనశర్మ

*ఆడవారు కారు అబల లెపుడు*
రాజకీయమందు రాసలీలలయందు
దేశరక్షజేయు ధీరులైరి
రుద్రమలును ఝాన్సి భద్రకాళులు వీరు
ఆడవారు కారు అబలలెపుడు

అంశం: ఆశువు-
సింగీతం నర్సింహారావు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వై. యస్.ఆర్. సి ,పీ  పార్టీ అత్యధిక సీట్లు గెలుపు.పై ఆశువుగా పద్యం

పూరణ:-
జగనుకు సమమిటలేదని
యగణితమగు గెల్పుదక్కనంతాయొకటై
పగలుగరేయినిమార్చిరి
ధగధగమను బాణసంచధరలోపేల్చన్

అంశం : ఛందోభాషణం
శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు

శ్రీ కాళేశ్వరముక్తిదాయక! మహాసిద్ధిప్రదా! దేవరా!
లోకాతీత గుణోజ్జ్వలా!...నగజసల్లోలా! త్రిలోకోజ్జ్వలా!
నాకాధీశ్వర సన్నుతా!......శశిధరా! నందీశ సద్వాహనా
నీకున్ మొక్కెద నన్ను బ్రోవర!.....శివా! నీలేశ!భోళా హరా!


సోదర సోదరీమణుల సూచనలన్ గురుతెర్గి వారియా
మోదము తోడ పండితుల
ముందు న ధారణజేయ నిందులో
పాదము లందు ఛందమున బల్కెడి తప్పుల జూడకుండనా
హ్లాదము చెంది దీవనల నందగ జేసిరి మీకు మ్రొక్కెదన్ .

సభకు నమస్కరింతు,కవిచంద్రులకున్ బుధవర్గమంతకున్
ప్రభుతకు,శక్తికిన్ సతత పద్యకవిత్వపటుత్వ దేవికిన్
విభవము గూర్చు తల్లికిని,విశ్వవినోద విహార విష్ణుకున్
అభయము నిచ్చి భావిపథమందున ధారణ గల్గజేయగన్

వాణి దయ నాకు నేడిట వాక్కునిచ్చె
కవుల సహకారమే నేడు రవము నిచ్చె
ముక్తినాథుని వరము నా శక్తి నింపె
ధన్యమయ్యెను నాయవధాన చరిత

స్వస్తి పలికెద నేటి వాక్సభకు నిపుడు
సహకరించిన కవుల వశ్యమ్ములోన
ధన్యవాదములందరు మన్యులకును
మొదటి యత్నమీ యవధాన ముదయమయ్యె

అభినందనలు:
పద్య పూరణ జేసెనుపటుతరముగ!
మమ్ము సంతృప్తిపరచగముదమునొంద!
ఘనత కెక్కెను మాడ్గులభాస్కరన్న!
మనసు నమస్సు లర్పించి మరువమయ్య!
-సింగీతం నర్సింహారావు.

సూర్యతేజమట్లుజూపినపద్యాల
ధారజూపిరెంతొ ధైర్యమలర
పద్యములను పంచి, బాస్కర వర్యుల
కీర్తినొందెభక్తి కేతనమున..
- సరస్వతీ రామశర్మ


వెలుగులుపంచుయినుడై
తెలుగునువెలిగించినాడుతేటగనిచటన్
విలువగుపద్యముపంచిరి
పలువురుపండితులుమెచ్చభాస్కర!కృష్ణా!
- గోగులపాటి కృష్ణమోహన్

పూరణ సంపూర్ణం
మీ
గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయకర్త

Comments

Popular posts from this blog

పద్యపూరణలు

చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్య పూరణలు

అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారి పద్యపూరణలు