అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారి పద్యపూరణలు
ఈ రోజు పద్యపూరణలు...
చేయువారు:
అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారు
సమన్వయకర్త
గోగులపాటి కృష్ణమోహన్
అంశాలు:
1.నిషిద్దాక్షరి : చీదెళ్ళ సీతాలక్ష్మి గారు
2.సమస్య: పద్మ చిగురాల గారు
3.దత్తపది: రామక కృష్ణమూర్తి గారు
4.వర్ణన: సరస్వతి రామశర్మ గారు
5.ఛందోభాషణ: మాడుగుల మురళీధర్ శర్మ గారు
6.అంత్యాదక్షరి : జ్ఙానప్రసూన శర్మ గారు
7.దృశ్యం : మాడుగుల భాస్కర్ శర్మ గారు
8.ఆశువు:చుక్కాయపల్లి శ్రీదేవి గారు
ప్రార్థన !
🍁🍁🍁
అల పెద్దన్న నుతించినట్టిదగు బాల్యంబైన నీ లీల,నా
లలితంబైన యెడంద నిండునటులన్ లాలించి బోధించె ని
ర్మలశీలుండగు తాతపాదుడల తన్మాధుర్యమున్ గ్రోలి నే
పలుకన్నేర్చితి నా నుతిన్ గొనుము విభ్రాజద్గణాధీశ్వరా!
ప్రార్థన!
🍁🍁🍁
అక్షరమాలావర్ణ్యామ్
వీక్షణవిన్యస్తసౌధవిద్యాత్మామ్
ఐక్షవచాపాం వందే
సాక్షాత్కామేశమానసాం హంసీమ్!
అంశం:దత్తపది
పృచ్ఛకుడు: డా.రామక కృష్ణమూర్తి
మతి,గతి,క్షితి,రతి-మాతృదేశ వైభవ వర్ణన-మత్తేభ వృత్తంలో చెప్పగలరు
1) పూరణ: దత్తపది:
🍁🍁🍁
మతిమన్మాతృధరాభిరక్షకులు త్వన్మాహాత్మ్యసంస్థాపకుల్
గతిమద్భద్రసుకృత్యవర్ధనులు నీ కాంతిన్ ప్రచోదింపగా
క్షితిలో నీకిక సాటిలేరు జననీ!స్వేచ్ఛాప్రమోదాన, భా
రతి!యాశీస్సుల మమ్ము బ్రోవుము సదా రాజత్సురక్షాప్రభన్!
2) అంశం...వర్ణన(పద్యరూపంలో)
సరస్వతీ రామశర్మ
సంపదెంతజూడసామాన్యజీవికి
అందుబాటులేనియధికధరలు
రోగమందుపడిన భోగమంతచెడగ
పడెడు"వర్ణన "గనపరుచు మయ్య!!
పూరణ: వర్ణన:
🍁🍁🍁
ధరలుజూడ నెపుడు ధరలోన నిల్వవు
నింగికెగసిపోవు నిత్యమరయ
భోగములు నశించి రోగమ్ములే నేడు
తిండి కూడ కరవు దినము దినము!
3) అంశం: సమస్య...
పద్మ చిగురాల
దాసుని విన్నపాలువిని,దక్షత గూర్చగ దారిచూపగన్.
పూరణ : సమస్య :
🌸🌸🌸
ఓ సకలేశ! నీకొరకహో నుతియించెద వేలమార్లు నీ
భాసురమైన విగ్రహము భవ్యము దివ్యము శర్మదంబగున్
నా సకలార్తులన్ దులిపి నాకఖిలంబు నొసంగ గోరితిన్
దాసుని విన్నపాలు విని దక్షత గూర్పగ దారి జూపగన్!
4) అంశం: దృశ్యం
మాడుగుల భాస్కర శర్మ
పూరణ: దృశ్యం
దృశ్యం:
🍁🍁🍁
జీవననౌకలో సకలజీవులు సాగుచునుందురెప్పుడున్
జీవనసాగరమ్ముననె జీవననౌక చరించుచుండు నా
జీవనకాలమా గమనచిత్రము ముందుకు సాగి సాగి యా
జీవననౌక చేరు వరసేవ్యమునైన పరాత్మతీరమున్!
5) అంశం: ఆశువు
భూతదయను గురించి తెలపగలరు
పూరణ: ఆశువు:
🍁🍁🍁
తన సంతానము నెంతగ
కనికరమున జూచుచుంద్రు గారవములతో
కనుగొని ఇతరపు ప్రాణుల
ననయము నారీతి జూడనౌ నెల్లరకున్!
6) అంశం: ఛందోభాషణం
మాడుగుల మురళీధర శర్మ
సిద్ధిపేట.
*************************
పూరణ: ఛందోభాషణం
కర్మలు ధర్మమార్గమున*
కాయము మోక్షము నొందురీతిగా!
కర్మలు సేయగా వలయు*
కాలమునేగతిగాచరించినా!
కాలమె మూలమౌ జగతి కాంక్షలు దీరగనెన్నడైననా
నిర్మలమానసాంతరిత*
నేమము వీడకనుండుమిత్తరిన్!
7)
అంశం::అంత్యాద్యక్షరి
:జ్ఞానప్రసూనా శర్మ
🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీవాణీ చరణంబుల
సేవా భాగ్యంబుగలుగ చిత్తము ఘనమై
దేవా! సంతసముననే
రావాలన్నిర్ణయించ రమ్యత దొరికెన్:
పూరణ: అంత్యాద్యక్షరి:
🍁🍁🍁🍁
నీవే సకలము తల్లీ!
భావాంబరవీధి వెలుగు పార్వణచాంద్రీ
ప్లావితరసధునివీవే
సేవింతునశేషకృతుల జీవితమెల్లన్!
8) అంశం : నిషిద్ధాక్షరి
గోగులపాటి కృష్ణమోహన్
నిషిద్దాక్షరాలు: ఆ, మరియు హ గుణింతం
విషయము హనుమత్ జయంతిని వర్ణించండి
పూరణ: నిషిద్ధాక్షరి:
🌸🌸🌸🌸
సుందరవీరుని శౌర్యము
సుందరకాండాంతరంగశోభను నిలుపన్ డెందమునందున రాముని
స్పందింపగజేసినట్టి స్వామిని గొలుతున్!
అంశం : నిషిద్ధాక్షరి
చీదెళ్ళ సీతాలక్ష్మి
శ,హ, నిషిద్దమ్...
శివ అంశ హనుమంతుని గురించి స్వేచ్చా ఛందము..లో
పూరణ: నిషిద్ధాక్షరి:
🍁🍁🍁
పుట్టెను సుందరవీరుడు
మెట్టెను లంకాధినాథమేదిని లోనన్
కొట్టెను రాక్షసవీరుల
పట్టెను సీతమ్మజాడ స్వామికి దెలుపన్!
ప్రశ్నలు కుసుమములయ్యెను
ప్రశ్నలకుత్తరములును సుపద్మములయ్యెన్
ప్రశ్నల కేళియు మాలిక
ప్రశ్నానంతరవినోదరాగములలరన్!
ఎంత వేగమా..దేవుడా..శరంపద్యం
వేగమాశరవేగమాయది
పద్యమామరిహృద్యమా
సాధ్యమామనకసాధ్యమా
బృందమందిరమందునా..
🙏🌹🙏🌹🙏
నమోనమః
🙏🌹🙏🌹🙏
మంగళాచరణము:
🌸🌸🌸🌸🌸🌸
నన్ను నడిపించితివి పద్యనందనమున
సరసకవితావధానవిశాలకేళి
నీ దయామృతవర్షమ్ము నిండిపోవ
సిద్ధతన్ నిల్వ మాతృకా! చిత్రమేమి?
అందరికీ కృతజ్ఞతాభివాదాలతో....
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
అభినందనలు
అవధానమందలంశము
లవలీలగనాశువుగను*
నందించినమా!
యవధానినటేశ్వరునకు
సవినయసాష్టాంగవంద*
సద్వందనముల్!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మాడుగుల మురళీధర శర్మ
సిద్ధిపేట
ఎంత వేగమా..దేవుడా..శరంపద్యం
వేగమాశరవేగమాయది
పద్యమామరిహృద్యమా
సాధ్యమామనకసాధ్యమా
బృందమందిరమందునా..
🙏🌹🙏🌹🙏
నమోనమః
సరస్వతి రామశర్మ
🙏🌹🙏🌹🙏
కృతజ్ఙతాభివందనాలు
వందనములందుకొనుమా
నందంబుగసభను నడిపి నందనవనమై
చందనమలరించిరిమీ
సుందర పద్యాలచేత సూక్తిగ కృష్ణా
గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయం
స్వస్తి
చేయువారు:
అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారు
సమన్వయకర్త
గోగులపాటి కృష్ణమోహన్
అంశాలు:
1.నిషిద్దాక్షరి : చీదెళ్ళ సీతాలక్ష్మి గారు
2.సమస్య: పద్మ చిగురాల గారు
3.దత్తపది: రామక కృష్ణమూర్తి గారు
4.వర్ణన: సరస్వతి రామశర్మ గారు
5.ఛందోభాషణ: మాడుగుల మురళీధర్ శర్మ గారు
6.అంత్యాదక్షరి : జ్ఙానప్రసూన శర్మ గారు
7.దృశ్యం : మాడుగుల భాస్కర్ శర్మ గారు
8.ఆశువు:చుక్కాయపల్లి శ్రీదేవి గారు
ప్రార్థన !
🍁🍁🍁
అల పెద్దన్న నుతించినట్టిదగు బాల్యంబైన నీ లీల,నా
లలితంబైన యెడంద నిండునటులన్ లాలించి బోధించె ని
ర్మలశీలుండగు తాతపాదుడల తన్మాధుర్యమున్ గ్రోలి నే
పలుకన్నేర్చితి నా నుతిన్ గొనుము విభ్రాజద్గణాధీశ్వరా!
ప్రార్థన!
🍁🍁🍁
అక్షరమాలావర్ణ్యామ్
వీక్షణవిన్యస్తసౌధవిద్యాత్మామ్
ఐక్షవచాపాం వందే
సాక్షాత్కామేశమానసాం హంసీమ్!
అంశం:దత్తపది
పృచ్ఛకుడు: డా.రామక కృష్ణమూర్తి
మతి,గతి,క్షితి,రతి-మాతృదేశ వైభవ వర్ణన-మత్తేభ వృత్తంలో చెప్పగలరు
1) పూరణ: దత్తపది:
🍁🍁🍁
మతిమన్మాతృధరాభిరక్షకులు త్వన్మాహాత్మ్యసంస్థాపకుల్
గతిమద్భద్రసుకృత్యవర్ధనులు నీ కాంతిన్ ప్రచోదింపగా
క్షితిలో నీకిక సాటిలేరు జననీ!స్వేచ్ఛాప్రమోదాన, భా
రతి!యాశీస్సుల మమ్ము బ్రోవుము సదా రాజత్సురక్షాప్రభన్!
2) అంశం...వర్ణన(పద్యరూపంలో)
సరస్వతీ రామశర్మ
సంపదెంతజూడసామాన్యజీవికి
అందుబాటులేనియధికధరలు
రోగమందుపడిన భోగమంతచెడగ
పడెడు"వర్ణన "గనపరుచు మయ్య!!
పూరణ: వర్ణన:
🍁🍁🍁
ధరలుజూడ నెపుడు ధరలోన నిల్వవు
నింగికెగసిపోవు నిత్యమరయ
భోగములు నశించి రోగమ్ములే నేడు
తిండి కూడ కరవు దినము దినము!
3) అంశం: సమస్య...
పద్మ చిగురాల
దాసుని విన్నపాలువిని,దక్షత గూర్చగ దారిచూపగన్.
పూరణ : సమస్య :
🌸🌸🌸
ఓ సకలేశ! నీకొరకహో నుతియించెద వేలమార్లు నీ
భాసురమైన విగ్రహము భవ్యము దివ్యము శర్మదంబగున్
నా సకలార్తులన్ దులిపి నాకఖిలంబు నొసంగ గోరితిన్
దాసుని విన్నపాలు విని దక్షత గూర్పగ దారి జూపగన్!
4) అంశం: దృశ్యం
మాడుగుల భాస్కర శర్మ
పూరణ: దృశ్యం
దృశ్యం:
🍁🍁🍁
జీవననౌకలో సకలజీవులు సాగుచునుందురెప్పుడున్
జీవనసాగరమ్ముననె జీవననౌక చరించుచుండు నా
జీవనకాలమా గమనచిత్రము ముందుకు సాగి సాగి యా
జీవననౌక చేరు వరసేవ్యమునైన పరాత్మతీరమున్!
5) అంశం: ఆశువు
భూతదయను గురించి తెలపగలరు
పూరణ: ఆశువు:
🍁🍁🍁
తన సంతానము నెంతగ
కనికరమున జూచుచుంద్రు గారవములతో
కనుగొని ఇతరపు ప్రాణుల
ననయము నారీతి జూడనౌ నెల్లరకున్!
6) అంశం: ఛందోభాషణం
మాడుగుల మురళీధర శర్మ
సిద్ధిపేట.
*************************
పూరణ: ఛందోభాషణం
కర్మలు ధర్మమార్గమున*
కాయము మోక్షము నొందురీతిగా!
కర్మలు సేయగా వలయు*
కాలమునేగతిగాచరించినా!
కాలమె మూలమౌ జగతి కాంక్షలు దీరగనెన్నడైననా
నిర్మలమానసాంతరిత*
నేమము వీడకనుండుమిత్తరిన్!
7)
అంశం::అంత్యాద్యక్షరి
:జ్ఞానప్రసూనా శర్మ
🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీవాణీ చరణంబుల
సేవా భాగ్యంబుగలుగ చిత్తము ఘనమై
దేవా! సంతసముననే
రావాలన్నిర్ణయించ రమ్యత దొరికెన్:
పూరణ: అంత్యాద్యక్షరి:
🍁🍁🍁🍁
నీవే సకలము తల్లీ!
భావాంబరవీధి వెలుగు పార్వణచాంద్రీ
ప్లావితరసధునివీవే
సేవింతునశేషకృతుల జీవితమెల్లన్!
8) అంశం : నిషిద్ధాక్షరి
గోగులపాటి కృష్ణమోహన్
నిషిద్దాక్షరాలు: ఆ, మరియు హ గుణింతం
విషయము హనుమత్ జయంతిని వర్ణించండి
పూరణ: నిషిద్ధాక్షరి:
🌸🌸🌸🌸
సుందరవీరుని శౌర్యము
సుందరకాండాంతరంగశోభను నిలుపన్ డెందమునందున రాముని
స్పందింపగజేసినట్టి స్వామిని గొలుతున్!
అంశం : నిషిద్ధాక్షరి
చీదెళ్ళ సీతాలక్ష్మి
శ,హ, నిషిద్దమ్...
శివ అంశ హనుమంతుని గురించి స్వేచ్చా ఛందము..లో
పూరణ: నిషిద్ధాక్షరి:
🍁🍁🍁
పుట్టెను సుందరవీరుడు
మెట్టెను లంకాధినాథమేదిని లోనన్
కొట్టెను రాక్షసవీరుల
పట్టెను సీతమ్మజాడ స్వామికి దెలుపన్!
ప్రశ్నలు కుసుమములయ్యెను
ప్రశ్నలకుత్తరములును సుపద్మములయ్యెన్
ప్రశ్నల కేళియు మాలిక
ప్రశ్నానంతరవినోదరాగములలరన్!
ఎంత వేగమా..దేవుడా..శరంపద్యం
వేగమాశరవేగమాయది
పద్యమామరిహృద్యమా
సాధ్యమామనకసాధ్యమా
బృందమందిరమందునా..
🙏🌹🙏🌹🙏
నమోనమః
🙏🌹🙏🌹🙏
మంగళాచరణము:
🌸🌸🌸🌸🌸🌸
నన్ను నడిపించితివి పద్యనందనమున
సరసకవితావధానవిశాలకేళి
నీ దయామృతవర్షమ్ము నిండిపోవ
సిద్ధతన్ నిల్వ మాతృకా! చిత్రమేమి?
అందరికీ కృతజ్ఞతాభివాదాలతో....
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
అభినందనలు
అవధానమందలంశము
లవలీలగనాశువుగను*
నందించినమా!
యవధానినటేశ్వరునకు
సవినయసాష్టాంగవంద*
సద్వందనముల్!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మాడుగుల మురళీధర శర్మ
సిద్ధిపేట
ఎంత వేగమా..దేవుడా..శరంపద్యం
వేగమాశరవేగమాయది
పద్యమామరిహృద్యమా
సాధ్యమామనకసాధ్యమా
బృందమందిరమందునా..
🙏🌹🙏🌹🙏
నమోనమః
సరస్వతి రామశర్మ
🙏🌹🙏🌹🙏
కృతజ్ఙతాభివందనాలు
వందనములందుకొనుమా
నందంబుగసభను నడిపి నందనవనమై
చందనమలరించిరిమీ
సుందర పద్యాలచేత సూక్తిగ కృష్ణా
గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయం
స్వస్తి


Comments
Post a Comment