మంచినీళ్ళ సరస్వతి రామశర్మ పద్యపూరణలు

పద్యపూరణలు... 9వ రోజు

చేయువారు: మంచినీళ్ళ సరస్వతి రామశర్మ

సమన్వయం: గోగులపాటి కృష్ణమోహన్

అంశాలు

1.అంత్యాదక్షరి
2.సమస్య: సింగీతం నరసింహారావు గారు
3.దత్తపది: గోగులపాటి కృష్ణమోహన్ గారు,
సింగీతం నరసింహారావు గారు
4.వర్ణన: రామక కృష్ణమూర్తి గారు
5.ఛందోభాషణ: మాడుగుల భాస్కర శర్మ గారు
6 న్యస్థాక్షరి: చీదెళ్ళ సీతాలక్ష్మి గారు
7.దృశ్యం : సింగీతం సంధ్యారాణి గారు
8.ఆశువు: గుళ్ళపల్లి కాంతికృష్ణ గారు

🙏🌹🙏🌹

🙏🌹🙏
శ్రీగణాధిపతయేనమః
శ్రీసరస్వత్యై నమః
లక్ష్మీనృహింహ మమదేహి కరావలంబం..
🙏🙏🙏
శ్రీకారముగాసాగగ
సాకారమునందజేయు సాహిత్యముకై
ప్రాకటముగతొలిపూజల
జేకొను,గణనాథుపదము,చేమోడ్పులివే.
🙏🙏🙏

1) అంశం:వర్ణన
పృచ్ఛకుడు: డా.రామక‌ కృష్ణమూర్తి

గ్రీష్మ ఋతువును మీ స్వేచ్ఛా వృత్తంలో వర్ణించండి

పూరణ: వర్ణన

ఏమని జెప్పగ తలచెద
నీమంటలనార్పవశమె నేడిట తలచన్
ఏమాయాజాలమిదో
ఏ మాత్రమునోపకుంటి మెటు పోదుమొకో...

2) అంశం... ఆశువు
గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ

వేగంగా వెళుతున్న వాహనం . అందులో కూర్చున్న ప్రయాణీకుల ఆలోచనలు...
🙏🙏🙏🙏

పూరణ: వర్ణన

వేగమనగజూడ వేడిగా తలచేరు
పడుచు జనులకెల్ల పండగౌను
కలకల మనుచుండ కారుల మధ్యలో
ముదుసలి పదమలకు ముల్లేయౌగా

3) అంశము: సమస్య
సింగీతం నర్సింహారావు.

"సుమతి పద్య మరయసుదతి నేడ్చె". 
 సమస్య

మతినిజెడిన భర్త గతిని జూసిన భార్య
తలచి జూడనేతో తగవుబుట్ట
ఇరుగు పొరుగు వారు యింట జేరగజెప్పు
సుమతి పద్య మరయ సుదతి నేడ్చె


4) అంశము: న్యస్తాక్షరి
చీదెళ్ళ సీతాలక్ష్మి

శుక్రవారం.. చివరి అక్షరాలుగా ఒక్కో పాదం లో ఒక్కో అక్షరాన్ని ఉపయోగిస్తూ అమ్మ వారి ప్రార్థన...

పూరణ: న్యస్థాక్షరి

అమ్మాయనితలచిన శు
భమ్ముల మా సకలజనుల భాగ్య పరాక్ర
మ్య,మ్మగునుపార్వతిగ,వా
రమ్మగుశుభమిమ్ముదేవి రాణిగకోరన్

5) అంశం..దత్తపది
గోగులపాటి కృష్ణమోహన్

చాల జాల ఏల .కోల. 
కృష్ణుని ఆగడాలు
వర్ణించండి

పూరణ: దత్తపది

తాల జాల లేక తగవులంజేసేటి
కొంటెకృష్ణుజూపి గోపభామ
ఏలజెప్పవలయు కోలతో కొంటెగా
చల్లకొల్లగొట్టె పిల్లడితడు.

దత్తపది - 2
సింగీతం నరసింహారావు

వనజ,గిరిజ,హిమజ,మహిజ లతో పార్వతి మాత వర్ణిస్తూ పద్యం

పూరణ : దత్తపది - 2

వనజగ వెలిసినగిరిజవు
మనమునవెలయంగరాగ మాతంగివలెన్
జనమునమహి,జగదంబగ
చని,హిమజగజన్మనొంది వాసిగవెలసెన్

6) అంశం: ఆద్యంత్యక్షరీ
మల్లావఝ్ఝుల చంద్రశేఖర శర్మ

ఆరంభించరు నీచమానవులు విఘ్నాయససంత్రస్తులై
యారభించి పరిత్యజింతురు విఘ్నాయాత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమాను లగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

పూరణ; అంత్యాదక్షరి

నమ్మితి.నామమంత్రములునమ్మితినీపదపద్మయుగ్మమే
సొమ్ముగజేసినాపలుకుశోభలగూర్తును శారదాంబ,నీ
ఝుమ్మనువీణతంత్రులను జాలగవారగజేసిభవార్థిలోపడే
మమ్ములగాచగాతలచిమాతనునమ్ముదు.మానసంబులో


7) అంశం: దృశ్యం
సింగీతం సంధ్యారాణి, గజ్వేల్.

పై దృశ్యం నకు స్వేచ్చా వృత్తం లో పద్యం చెప్ప మనవి🙏

పూరణ: దృశ్యం

కౌరవ నాశనా నికన గానన వచ్చును నీసభా స్థలీ
గౌవరమేమిలేకనిట గర్వముజూపగ కౌరవేంద్రడే
కావరమట్టినట్టిమన గారవమందెడి లోకమాతయౌ
శౌరి సుసోదరీ యనక శౌర్యము జూపెను పాపకారై..

8) అంశం: ఛందోభాషణం
మాడుగుల భాస్కర శర్మ

పూరణ: ఛందోభాషణం

మోడి ప్రధాన మంత్రి మును ముందుగ భారత దేశజనావళీమనో
వేడిగ. వాడిగా.ప్రజలు.వేడుకలోమునిగాడుచుండగా
పాడిగ పేదవారికటబాసటగానిలుచుందురంచుమా
వాడుగమల్లివచ్చెనని వాడలవాడల వుత్సవంమ్ములై.....

ఛందోభాషణం...
🌹🙏🌹🙏


సభావందనం
దోషమెంచకుండ తోడుగ నుండుమా
పోషణమ్మజేయు భాష యందు
పద్య పూర ణమ్ము పాటిగా సాగించు
సోదరులకు సభావందనమ్ము
🌹🙏🌹🙏🙏


శ్రీవాణీ దయనుండగ
నేవాక్కునుచదోషములను నెంచక నందున్
కేవల భావమువజూడుము
కోవిదులందరకు మనవి గూర్చెద సుజనా
సరస్వతీ రామశర్మ


అభినందనలు

మల్లావఝ్ఝుల చంద్రశేఖర శర్మ

అభినందన శుభవందన
సభలో విద్వత్ ప్రపూర్ణ సారస్వతికిన్
ప్రభవించిన పద్యములకు
ప్రభుతకుసద్వాణిపలుకు
ప్రాభవమునకున్


మాడుగుల భాస్కర శర్మ

శ్రీ సరస్వతీ రామశర్మేన కృతము
పద్య సత్పూర్ణ యవధాన పలుకుబడులు
సభకు నుత్సాహమందించె
సత్యమిదియె
ఎవరు ముందుకు రానియీ యవధిలోన


సరస్వతికి ఆశీరభినందన!
🍁🍁🍁🍁🍁🍁🍁

కవితాసారసవనమున
కవయిత్రీప్రతిభ యలర కనుమా శుభముల్
నవలాసరస్వతీ! నీ
కవనమ్ము బ్రశస్తమాయె ఘనపద్యములన్!

అభినందనలతో.....

డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ.



గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ

నిన్న ఆపద్ధర్మంగా పూరణలు చేసిన మంచినీళ్ల సరస్వతీ రామశర్మ గారికి అభినందన పూర్వకముగా

🕉🕉🕉🕉🕉🕉

శుభముగ బద్యాల నిటుల,
సభయందున బూరణముల జక్కగ జేయన్
శుభకామన లందింతును
నభయముగసరస్వతి! జయ మందనుడువుమా!


💐💐💐💐💐💐💐💐
ముత్యంపేట గౌరీశంకర శర్మ:
నిన్న  పద్యపూరణలు చేసిన శ్రీ మతి సరస్వతీ రామశర్మ గారిని అభినందిస్తూ....
సరససరస్వతీచరణశబ్దసముచ్చయమందుపుట్టి భా
సురముగ విద్యనేర్చి పరిశుద్ధవచ:పరిపూర్ణ పాకవై
నిరతసుసంస్క్రతీసలిల నిర్మలధారలగ్రోలిపూతవై
జరిపినసత్కవిత్వపదజాలపరంరవెన్నుదట్టగా
విరిసెనుపద్యభావములు విశ్రుతకీర్తి సరస్వతీ! నిరం
తరముగసాధనాభ్యుదయధార్మికసత్పథమందు నిల్వుమా!.....ఆశీరభినందనలతో......ము.గౌ.శర్మ.

కృతజ్ఙతాభివందనాలు

ఆసుపత్రిలోన నటు నాన్న విడుదల
పద్య పూరణలకు పాటు బడుచు
కృషిని సల్పి కవుల కృతనిశ్చయము సర
స్వతికి కీర్తి నింపె సాహసముగన్

గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయకర్త
శతాధికష్టావధానవేదిక

స్వస్తి


Comments

Popular posts from this blog

పద్యపూరణలు

చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్య పూరణలు

అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారి పద్యపూరణలు