ముత్యంపేట గౌరిశంకర శర్మ పద్యపూరణలు
తేది : 26-05-2019, ఆదివారం
పద్యపూరణలు చేయువారు:
అవధాని బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ గారు
అంశాలు:
1) వర్ణన చీదెళ్ళ సీతాలక్ష్మి గారు
2) సమస్య సరస్వతి రామశర్మ గారు
3) దత్తపది రామక కృష్ణమూర్తి గారు
4) అశువు గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారు
5) నిషిద్ధాక్షరి: సింగీతం నరసింహారావు గారు
6) ఛందోభాషణం: చుక్కాయపల్లి శ్రీదేవి గారు
7) అంత్యాదక్షరి:
8) శ్లోకానువాదము: గోగులపాటి కృష్ణమోహన్ గారు, అమరవాది రాజశేఖర శర్మ గారు
సమన్వయం
గోగులపాటి కృష్ణమోహన్
స్వాగతవచనము
అవధానిప్రశంసా!
🌸🌸🌸🌸🌸
గౌరీశంకరకరుణా
పాత్రీకృతసాహితీవిభాస్వత్కవయే
గౌరీశంకరనామ్నే
స్వస్త్యస్తు నవావధానిమణయే నిత్యమ్!
అభినందనపురస్సరమ్....
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్రీ వినాయక!గణనాధ!చిద్విలాస!
నేటియష్టావధానమ్ము మేటిగాను
నీవెనడిపింపగాజేసి నిలిచిచెంత
భయముతొలగించి నాకిమ్ము జయముదేవ!...
---- ముత్యంపేట గౌరిశంకర శర్మ
1) అంశం.వర్ణన
డా.చీదెళ్ల సీతాలక్ష్మి
నేటి భోజన వ్యవస్థ..అవస్థ ను స్వేచ్ఛా ఛందము లో వర్ణించండి....
పూరణ : వర్ణన
ఎచ్చట చూసినన్ భఫులు ఏర్పడ మింగగలేక కక్కకన్
అచ్చట నిలువరాదు కరమందు గ్రహించిన పళ్ళెమందునన్
ముచ్చటలేమిలేవు మరి ముఖ్య పదార్థ సుభక్షణమ్ములా
స్వచ్ఛపు భోజనంబులివి సాగుచునుండెను ఏమి భాగ్యమో
2) అంశం ...సమస్య..
సరస్వతీ రామశర్మ
సజ్జనసాంగత్యమువిడసాధుగుణంబౌ.
పూరణ : సమస్య
ముజ్జగములు తిరిగిన నది
మజ్జనములు సేయ పుణ్య మార్గముగల్గున్
బిజ్జలమార్గంబిది,యే
సజ్జన సాంగత్యము విడ సాధుగుణంబౌ
3) అంశం:దత్తపది
డా.రామక కృష్ణమూర్తి
రండ,ముండ,బండ,దండ-వరకట్న నిషేధ సమస్య-స్వేచ్ఛా వృత్తం
పూరణ : దత్తపది
బండలు పిండిజేయగల భాగ్యముగల్గినగాని సత్యమే
ముండని మాటలాడుచును మూర్ఖులు కొందరు విత్త కాంక్షచే
దండగ కట్నమీయుమని ధారుణమైనటువంటి కోర్కెల్
రండగజేయ నందరు దురాక్రమణంబును మాన్పగావలెన్
లెండిక మానవోత్తములు లెస్సగ కట్న నిషేదమందునన్
4) అంశం: అశువు
గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ
విప్రకవుల సమూహంలో 108 అవధానాలను పూర్తి చేసుకున్న తర్వాత రోజాకు ఒక ఔత్సాహిక కవిచేత కొనసాగించబడుతున్న పూరణ కార్యక్రమాన్ని వర్ణించ గలరని కోరుతున్నాను.
పూరణ: అశువు
నూటయెనిమిది యవధానబాటసాగి
ఊటయూరెను పద్యాలు పూటపూట
అట్టిమార్గమ్ము కవులంత పట్టినేడు చేయుచుండిరి పూరణల్ చేవతోడ
వారికెప్పుడు నేజేతు!వందనములు!..
5) అంశం : నిషిధ్ధాక్షరి:-
సింగీతం నర్సింహారావు.
పద్యంలో రేఫం నిషేధం. "రామతారకమహిమామృతము "
పూరణ: నిషిద్ధాక్షరి
రేఫము
భవబందమ్ముల బాపును శివమును గలిగింపచేయు చిన్మయ విధమై
భువి సీతాపతి గానము
అవధులు లేనట్టి మోక్ణమందించుకవీ
6) అంశం: ఛందోభాషణం
చుక్కాయపల్లి శ్రీదేవి
సౌభాగ్యమ్మన సంతసమ్ము మదిలో శాంతమ్ము సంతృప్తియున్
సౌభాగ్యమ్మన కావ్యశాస్త్ర పఠనాసక్తి ప్రసంగమ్ములున్
యేభావంబులనంత దుఃఖయుతమై హేయమ్ము గల్గించునో
ఆభావమ్ములుతీసివేయవలెనమ్మా!దైవసంపత్తితోన్!
7) అంశం: శ్లోకానువాదము
గోగులపాటి కృష్ణమోహన్
స ఏవ విశ్వం సృజతి స ఏవావతి హంతి చ
అథాపి హ్యనహంకారాన్నాజ్యతే గుణ కర్మభిః
పూరణ :అస్లోకాను వాదం - 1
అతడే విశ్వవిధానమంతయును తానాశ్వర్యమౌ రీతిలో
స్థితి పొందింపగజేయువాడు నతడే శిక్షింప, రక్షింప స
ద్గతి చేకూర్చునతండునెప్డు మదిలో గర్వంబు తా పొందకన్
అతి సామాన్యునివోలె దోచు జగతిన్ ఆర్యా గుణాతీతుడై
8) శ్లోకానువాదము - 2
అమరవాది రాజశేఖర శర్మ
మంగళం కోసలేంద్రాయ మహనీయ ........మంగళం
పూరణ: శ్లోకానువాదము-2
మంగళము కౌసలేయా
మంగళములు మీకునెపుడు మహనీయగుణా
మంగళము చక్రవర్తికి
మంగళమిదె రామచంద్ర మాళితసాంద్రా
అవధాని గారి స్వస్తి వాక్కులు
నా మదితోచిన యట్టుల
మీ ముందర పద్యములను మేలువచించన్
యేమేమి దోషముండెనొ
మీమనములనున్నమాట మేలుగ చెపుడీ!....
స్వస్తి. - ముత్యంపేట గౌరిశంకర శర్మ
అభినందనలు
🌹🙏🌹🙏
ముత్యమంటి పలుకు ముదముముత్యంపేట
గౌరిశంకరుల,సగౌరవముగ
పద్యపద్యమందు సద్యస్ఫూర్తిగలుగి
సుధలుజిలుకుమాటసూక్తినిచ్చు..
🌹🙏🌹🙏🙏
సరస్వతీ రామశర్మ
అవధానవర్యులు శ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ గారికి
కృతజ్ఙతాపూర్వక పద్యాభివందనాలు
శ్రీ గౌరీ శంకరులకు
నా గౌరీశంకరుండు నభయంబిచ్చెన్
వాగర్దమ్ములనిడగా
రాగాలాపనలతోడ రంజిలె కృష్ణా
✍🏼 గోగులపాటి కృష్ణమోహన్ 🌹
సమన్వయకర్త

Comments
Post a Comment