శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్యపూరణలు - 3
పద్యపూరణలు...
తేది 27-05-2019, సోమవారం
చేయువారు:
శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు
సమన్వయం:
గోగులపాటి కృష్ణమోహన్ గారు
అంశాలు:
1.నిషిద్దాక్షరి: అష్టకాల విద్యాచరణ్ గారు
2.సమస్య : రామక కృష్ణమూర్తి గారు
3.దత్తపది: మాడుగుల భాస్కర శర్మ
4.వర్ణన : గోగులపాటి కృష్ణమోహన్ గారు
5.ఛందోభాషణ: గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారు
6 న్యస్థాక్షరి: చీదెళ్ళ సీతాలక్ష్మి గారు
7.దృశ్యం : లక్ష్మీ మదన్ గారు
8.ఆశువు : రమాదేవి కులకర్ణి గారు
శ్రీదేవికి అభినందనలు!
🌸🌸🌸🌸🌸🌸🌸
నిరతము కవితాసాధన
వరముగ చేపట్టినావు పద్యవిరచనన్
చిరకీర్తినలరుమమ్మా!
వరపూరణవిద్యలందు వాక్ శ్రీదేవీ!
ఆశీస్సులతో.......
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఓం శ్రీ కృష్ణాయ నమః
ఓం శ్రీ సరస్వత్యై నమః
ఓం శ్రీ హయగ్రీవాయ నమః
సతతము నామ సంస్మరణ శ్వాసగ ధ్యాసగ నిత్యకృత్యమై
గతియిక నీవెయంచు తమకై పరిచర్యలొసంగి భక్తితో
నతులిత దివ్యతేజముల యందున నామది నిల్పియుంటి నా
జతయును దైవమున్ గురుడు సర్వము నీవనుకొంటి మాధవా
1) అంశం:సమస్య
పృచ్ఛకుడు: డా.రామక కృష్ణమూర్తి
మగని దూలనాడి మాన్యయయ్యె
పూరణ: సమస్యాపూరణం
సగము భాగమగుచు సంసారమును జేసి
యిడుములెన్నియున్న నేగుచుండ,
దురలవాట్లు మరిగి దుర్భాషలాడగా
మగని దూలనాడి మాన్యయయ్యె
2) అంశం: వర్ణన
గోగులపాటి కృష్ణమోహన్
కైలాసంలో శివతాండవాన్ని స్వేచ్ఛా వృత్తంలో వర్ణించండి
పూరణ: వర్ణన
ఢమఢమ డమరుక నాదము
దిమికిట తాళపు లయలో దేదీప్యముగన్
ప్రమథ గణంబుల జతలో
తమకమున గిరులుగదలగ తాండవమాడెన్
3) అంశం: దృశ్యం
లక్ష్మి మదన్
పై దృశ్యము పిల్లలు ఆడే తొక్కుడు బిళ్ళ ఆటని..వారి ఆనందాన్ని వర్ణించండి!
పూరణ: దృశ్యం
చింతలెరుంగబోక తపసేయను దీక్షగ సంతసంబునన్
పంతముబూని మైమరచి పండగయట్లనుభూతి జెంది, కే
రింతలు వెట్టి మూగి చెలరేగుచు సాగెడి పక్షిమూకల
ట్లంతములేని హర్షమున యాడిరి తొక్కుడు బిళ్ళలందరున్
4) అంశం: న్యస్తాక్షరి:
మాడుగుల మురళీధర శర్మ,
*డ* గుణింతాలు ప్రాసగా శార్దూలంలో శంకరుని స్తుతించండి.
పూరణ: న్యస్తాక్షరి
వాడేశంకరుడా హిమాలయము నింపారంగ గాపాడి తా
క్రీడా శేముషియోచు తాండవుడునై గేస్తుండునై గౌరికిన్
జోడై సృష్టిలయంబునన్ ప్రముఖుడైనచోద్యంపు వేషుండునౌ
రేడై జాహ్నవి గూడియుండె నితడే రుద్రుండు భద్రుండుగా
5) అంశం: దత్తపది
మాడుగుల భాస్కర శర్మ
కోయిల, కాకి,హంస,పావురం
ఈ పదాలతో స్వేచ్ఛా ఛందం లో గురువు ను వర్ణించండి
పూరణ: దత్తపది
ఈశ్వరుండన యెవరొకో యిలను గురువు
కరుణ సరగున జిలుకు యేకాకియతడు
హంసయై మంచి చెడున సహాయమొసగు
పక్షపాతమెరుంగని పావురమ్ము
6) అంశము: ఛందోభాషణం
గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ.
మక్కువ నీకథాశ్రవణ మాధురి మాకిక పుణ్యకార్యమే
చక్కని లీలలన్ దెలిసి సత్యమెఱుంగుచు సాగుచుండుటే
దిక్కగు మాకునెప్పుడును ధీవర నీ చరణంబు లీకడన్
మ్రొక్కెదనామదిన్ నిలిచి మోక్షపథమ్మును జేర్చుమయ్యరో!
7) అంశం: ఆశువు
రమాదేవి కులకర్ణి
ఒక వృద్ధుడు చాలా ఆస్థిపరుడు కానీ దిక్కులేని చావు చచ్చాడు. కుటుంబసభ్యులెవరు లేరు ,పక్కవారి చేతిలో మరణించాడు.అప్పుడే ఒక అమ్మాయి తన జన్మదినమని కేక్ తీసుకోమని వచ్చింది. ఎదురింట్లో రిమోట్ కోసం అత్తాకోడళ్లు తిట్టుకుంటున్నారు, వెనక ఎవరో జంట చంటోడికి అన్నం ఎవరు తినిపించాలి హోమ్ వర్క్ ఎవరు చేయించాలో అని కొట్టుకుంటున్నారు.
దీనిని వర్ణిస్తూ నేటిపరిస్థితులను ఏకరువు పెడుతూ *ఆశువుగా* చంపకమాలలో పద్యం చెప్పండి
పూరణ: ఆశువు
కనుమరుగైన బంధములు గానవు మృత్యువు కాటువేసినన్
జనన దినంబు సంబరము జాటగ బాలిక కేకు దెచ్చెగా
వినదగు కోడలా విడుము, పెద్దరికంబు రిమోటు కేలనో?
పెనిమిటి నీదు పాపడికి విద్యయునన్నము నీదుబాధ్యతే
8) అంశం: నిషిద్ధాక్షరి
అష్టకాల విద్యాచరణ్
రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న విషయాన్ని నిర్ధారిస్తూ స్వేచ్ఛా పద్యం..రేఫ నిషిద్ధం..
పూరణ: నిషిద్ధాక్షరి
మాటలకేల కట్టుబడు?మంచినిదుంచెడు మాయజాలమం
దాటలెగాని,మూటలిడ,నన్నయు దమ్ములు కత్తిదూయుటే
కోటలుదాటు మాటలతొ కూల్చగ జూడొకవింత, వేటకై
పూటకునొక్క సంఘమును పొందగ లజ్జనుగానబోముగా
9) దృశ్యం - 2
సరస్వతి రామశర్మ
పూరణ: దృశ్యం - 2
చిరుమువ్వల సవ్వడితో
కరుణించితివీ గృహమును కాపాడంగన్
మురిపెంబున నిను గొల్తును
వరలక్ష్మీనీమహిమలు వర్ణింతునుగా
అంశం: న్యస్థాక్షరి
నా పేరు..డా.చీదెళ్ల సీతాలక్ష్మి
సో,మ,వా,రం..ప్రతి పాదంలో ఒక్కొక్క అక్షరం మొదటగా ఉపయోగిస్తూ
శివుని స్తుతి చేయండి...
స్వేచ్ఛా ఛందము...
పూరణ: న్యస్తాక్షరి
సోముడెల్ల జగతి శోభించుచుండుగా
మహిమజూపునితడు మార్దవమున
వాసిగొన్న ఖ్యాతి వర్ణింప శక్యమా
రంగమయ్యె నటన రాజసమున
మదిలో నిలిచిన తలుపులు
పదిలముగా దాచుకొనెడి పద్యములల్లన్
సదయులు విప్రుల సంఘమె
సదనముగా మారి కవన సాధనమయ్యెన్
నేటి పద్యపూరణంలో పృచ్ఛకులకు మహనీయులకు పండితోత్తములకు సహృదయంతో సవరింపులు తెలిపిన ప్రోత్సాహకులకు ఆసక్తితో పాల్గొన్న సమూహ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదములు
ఆముదం చెట్టులాంటి నన్ను ప్రోత్సహిస్తున్న మహనీయులందరికీ ధన్యవాదములు
--- చుక్కాయపల్లి శ్రీదేవి
అభినందనలు
చుక్కాయపల్లిపద్యము
చక్కగజెప్పగజనులకు సంబరమిచటన్
మక్కువమాకున్ననుమే
మెక్కువజూడగనులేదు మెండుసమయమున్
--- మల్లావఝ్ఝుల చంద్రశేఖర శర్మ
సౌభాగ్యమాతదయతో
మాభాగ్యముచేతపద్యమధురిమవినగా..
శోభనుజేగూర్చెసభకు
శోభితమగు పద్యములను శుభమగురీతిన్...
సరస్వతీ రామశర్మ
కృతజ్ఙతాభివందనాలు
శ్రీదేవిగారి పదములు
నాదేశముగాశివాజ్ఞనారాధనగా
నాదరపూర్వక పూరణ
మోదముగాసుధలుజిలుకెమోదిత కృష్ణా!!
గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయకర్త
స్వస్తి

Comments
Post a Comment