చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్య పూరణలు
తేదీ 21-5-2019బుధవారం
సాయంత్రం7-30ని....
ఈ రోజు పద్యపూరణలు...
చేయువారు: శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు
సమన్వయం: గోగులపాటి కృష్ణమోహన్ గారు
అంశాలు:
1.నిషిద్దాక్షరి: మాడుగుల భాస్కర్ శర్మ గారు
2.సమస్య : రామక కృష్ణమూర్తి గారు
3.దత్తపది: సింగీతం నరసింహారావు గారు
4.వర్ణన : లక్ష్మీ మదన్ గారు
5.ఛందోభాషణ: మాడుగుల మురళీధర్ శర్మ గారు
6 న్యస్థాక్షరి: సరస్వతీ రామశర్మ గారు
7.దృశ్యం : గోగులపాటి కృష్ణమోహన్ గారు
8.ఆశువు : మల్లావఝ్ఝుల చంద్రశేఖర శర్మ గారు
ఇదొక ప్రయత్నం మాత్రమే... పెద్దలు అభినందించి ఆశీర్వదించగలరని మనవి.
ప్రార్థన
ఓం శ్రీ కృష్ణాయ నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ సరస్వత్యై నమః
సరస్వతీ ప్రార్థన
వందనమమ్మా పదముల
చందనముల నలది పద్య సౌందర్యముచే
సుందరి నిను సేవించెద
వందల దీవెనలొసంగు వాణీ కరుణన్
వర్ణన
లక్ష్మి మదన్
అవధాని గారికి నమస్కారములు!
లక్ష్మణుడు పర్ణశాల చుట్టూ రేఖ గీసి సీతమ్మ ను దాట వద్దని చెప్పినప్పుడు ..వారిద్దరి మధ్య సంభాషణ నీ వర్ణించండి!
సీత భూజాత పావన చరిత నిలన
గీత దాటెను చింతన కీడు మరచి
మాత ధరణిజ గాంచెను మాయ నపుడు
వ్రాత వ్రాసిన బ్రహ్మనే వాసి గాదు
వర్ణన పూరణ
సీతా లక్ష్మణుల సంభాషణ
సడి వినుము లక్ష్మణా యీ
యడవిన మీ సోదరుండు హా హా యనెగా!
తడబడి యడుగులు గదపకు
కడు జాగ్రత బూని నన్ను కరుణించమ్మా!
దత్తపది
సింగీతం నరసింహరావుగారు
లలిత, మహిజ, హిమజ, పద్మజ.అమ్మవారి స్తుతి
స్వేచ్ఛ ఛందము
పూరణ
అగణిత శుభగుణ ,లలితా
సుగుణాల వరాల మహిజ స్తుతియించెద నిన్
జగముల నేలెడు మహిజా
పగజూపకు పద్మజ నిను ప్రార్థింతునిలన్
సమస్య
రామక కృష్ణ మూర్తి గారు
చెడుదొవమ్మునుతించి కొల్చినగదా సిద్దించు వాంఛావళుల్
సమస్యా పూరణం
కడుదైన్యంబున గాచుమన్న కరుణన్ కాఠిన్యమున్ వీడుచున్
వడిగా రక్షకుడౌచునేగె క్షణమున్ వర్జింపకన్ ప్రీతి సం
దండిగా గాచె గజంబునార్తి గొనగన్ ,దాక్షిణ్యమున్ జూపి గా
చెడు దైవమ్మునుతించి గొల్చినగదా సిద్ధించు వాంఛావళుల్
ఆశువు...
మల్లావఝల చంద్రశేఖర్ గారు
అవధానమాగిన
విప్రకవులబృంద
మనోభావాలపై
ఆశువు
పూరణ
అవధానం ఆగినందున విప్రకవులమనోభావాలు
సాయము వేళ సవ్యముగ సాగుచునుండు వధానకేళికే
గాయములయ్యెనో విడెను కౌతుకముల్ కృశియించె నయ్యహో
సోయగమొప్పు పద్యముల శోభల సౌరులు రాలిపోవగన్
హాయిగలుంగునా?మదికి హా!యని ఖేదము గల్గె నిచ్చటన్
న్యస్తాక్షరి
సరస్వతీ రామశర్మ
సా.సా.సా.సా.
ఆద్యక్షరాలుగా
స్వేచ్చా ఛందస్సు లో
సంకటాలను హరించే గణపతి
స్తుతి..
న్యస్తాక్షరి పూరణ
"సా" నాలుగు పాదాలలో ఆది అక్షరంగా గణపతి ప్రార్థన
సారసదళ నాయనా నిను
సారసముల గొల్తునయ్య సాయంబిడుమా
సారములొసగెడి గణపతి
సారధి నీవై జగమును సాధింపుమయా
నిషిద్ధాక్షరి
డా. మాడుగుల భాస్కర శర్మ
భ,గ,ర,స అక్షరాలు నిషిద్ధం
గంగా నదిని స్వేచ్ఛా ఛందం లో వర్ణించండి
పూరణ
భగరస. నిషిద్ధాక్షరి
దివినే వీడిన జాహ్నవి
యవలీలనమోక్షమిచ్చు నదియై మదిలో
కవనమ్ముల పవనములకు
జవములనిడుమమ్మ నిన్ను చయ్యన దలతున్
ఛందోభాషణం
మాడుగుల మురళీధర శర్మ సిద్ధిపేట.
మామూశ: ఛందోభాషణం.
అవధానాంతరభాషణానిరతుగా*నమ్మానమస్సుల్ నివే!
వ్యవధానమ్మున పద్యభావ గతులన్ వాంఛించి పూరించెదన్
అవియేనిక్కమునీసమూహముననే*నాశించు ఛందమ్మునన్!
సవరింపంగ సమస్యలన్పదములన్ సాధింప దీవింపుమా
దృశ్యం:
గోగులపాటి కృష్ణ మోహన్ గారు
పూరణ
కవితలనల్లగా పద సుగంధములెల్ల మనస్సు నిండగన్
సువిధములైన వర్ణనలు, సూక్తులు పల్నుడికార మాధురుల్
జవమున సాగి రమ్య పదజాలము లెన్నియొనేరువాకలై
కవనమునందు జేరుగతి కన్యక చింతన జేసె నియ్యెడన్
ప్రథమ యత్నమ్ము మదిలోన పాదుకొనగా
నమ్మ దయజూపె నేడిక హాయిగలిగె
విప్ర కవుల సమస్యలు విందునొసగె
సంతసమ్మయ్యె సాయంత్ర సమయమందు
చుక్కాయపల్లి శ్రీదేవి గారికి అభినందలతో...
ఈ సభలోపల మహిళలు
ఆసనమైనట్టి దివ్య వాణితోచెన్
మాసభలో శ్రీదేవిగ
వాసిగ మీ పద్యధార వాక్కన కృష్ణా!
స్వస్తి
గోగులపాటి కృష్ణమోహన్


మీ పద్యాలు సహజమైన సెలయేరులాగా సాగిపోయాయి .👌
ReplyDeleteదన్యవాదాలు
Delete
ReplyDelete
ReplyDeleteసీత భూజాత పావన చేరితే
ReplyDeleteయతి పోయింది.
పద్య పూర్ణాలు బాగున్నాయి. మీరు భావనావీధిలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. ఇలాగే మీ కవితా ప్రస్థానాన్ని కొనసాగించండి
చాలా బాగున్నాయి మేడమ్...
ReplyDeleteచాలా బాగున్నాయి మేడమ్ గారు
ReplyDelete