Posts

పద్యపూరణలు

Image
పద్య పూరణలు (అవధానం) తేది 19-06-2020,  శుక్రవారం  పూరిస్తున్నవారు :  శ్రీమతి చుక్కాయపల్లి శ్రేదేవి గారు  నిర్వహణ :శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు అంశాలు - పృచ్ఛకులు  1 సమస్య - పద్మ చిగురాల గారు  2 అంత్యాద్యక్షరి - జ్ఞాన ప్రసూనా శర్మ గారు  3 దృశ్యం - లక్ష్మీమదన్ గారు  4 దత్తపది - లక్ష్మీ పద్మజ గారు  5 న్యస్తాక్షరి - మణిమాల గారు  6 అశువు - గాయత్రి గారు  7 నిషిద్ధాక్షరి - సంధ్యారాణి గారు  8 వర్ణన - హరిణా పవన్ గారు నేటి 62వ ఆన్లైన్ అష్టావధానానికి సుస్వాగతం ప్రార్థన అందెలు ఘల్లని మ్రోగగ చిందులు వేయు చును‌ కొంటె చేష్టలతోడన్ విందారగించు వెన్నుని సుందరమౌ మోముగాంచు శుభమెన్నటికో! కడవల వెన్నల గ్రోలుచు నడవలలో‌ నాట్యమాడు‌ నవ్వుల రేడున్ సుడివడి తిరిగెడి నడకల గడబిడలే గాంచి మురియు సంతసమెపుడో! సమస్య  పద్మ చిగురాల గారు  అవధాని గారికి నమస్కారం🙏🏻🌹 నా పేరు పద్మ చిగురాల... అంశం సమస్య: కదలకయున్నచో పెరుగు కండలు క్రొవ్వును దేహమందునన్..!            . . 🙏🏻.. వదలక సోమరుల్ బహుళ వాంఛలు గల్గి నిరంతరంబుగన్ కొదవయెలేని కోర్కెలతొ కొత్త రుచులల్ గను తిండి పోతులై మెదలకనుండి కాయమును మేపుచునుండగ చిక్కిపోదురా? కదలక యున్నచ

మాడుగుల భాస్కర్ శర్మ పద్యపూరణలు - 2

Image
పద్యపూరణలు - 10 తేది: 31-05-2019 ఈ రోజుపద్యపూరణలు... చేయువారు మాడుగుల భాస్కర్ శర్మ గారు సమన్వయం గోగులపాటి కృష్ణమోహన్ అంశాలు 1.నిషిద్దాక్షరి...గోగులపాటి కృష్ణ మోహన్ గారు 2.సమస్య... రామక కృష్ణ మూర్తి గారు 3.దత్తపది... సింగీతం నరసింహారావు గారు 4.వర్ణన... వేదాంతం సురేష్ బాబు గారు 5.ఛందోభాషణ... మాడుగుల మురళీధరశర్మ గారు 6 న్యస్థాక్షరి... సరస్వతీ రామశర్మగారు 7.దృశ్యం... పద్మజారంగరాజుగారు 8.ఆశువు... సరస్వతీ రామశర్మగారు ఓం శ్రీ మహా గణపతయేనమః ఓం శ్రీ మహా సరస్వత్యైనమః శ్రీ గురుభ్యోనమః ప్రభువు గణాధినాథునిట ప్రార్థన జేతు నవిఘ్నకర్తగన్ సభలకు ముందు పూజగొని సత్ఫలమీయగ సాటి యెవ్వరీ యిభముఖ దేవతాగ్రణికి నిచ్చెద జోతలు భక్తితోడుతన్ ఉభయ సతీప్రయుక్తుడుగ బుద్ధియు సిద్ధియు తోడు నిల్వగన్ వీణాపాణికి బ్రహ్మసు రాణికి కవితార్థమిచ్చు రాజీవముఖీ వాణికృపాణి కి పన్నగ వేణికి నావందనములు విధిగన్ గొనగన్ ... మాడుగుల భాస్కర శర్మ 1) అంశం.....నిషిధ్ధాక్షరి గోగులపాటి కృష్ణ మోహన్. స రి గ మ అక్షరాలు. నిషేధం తో సంగీతం యెక్క.విలువ తెలుపగలరు... స్వేచ్ఛా ఛందం పూరణ: నిషిద్ధాక్షరి పాటల

మంచినీళ్ళ సరస్వతి రామశర్మ పద్యపూరణలు

Image
పద్యపూరణలు... 9వ రోజు చేయువారు: మంచినీళ్ళ సరస్వతి రామశర్మ సమన్వయం: గోగులపాటి కృష్ణమోహన్ అంశాలు 1.అంత్యాదక్షరి 2.సమస్య: సింగీతం నరసింహారావు గారు 3.దత్తపది: గోగులపాటి కృష్ణమోహన్ గారు, సింగీతం నరసింహారావు గారు 4.వర్ణన: రామక కృష్ణమూర్తి గారు 5.ఛందోభాషణ: మాడుగుల భాస్కర శర్మ గారు 6 న్యస్థాక్షరి: చీదెళ్ళ సీతాలక్ష్మి గారు 7.దృశ్యం : సింగీతం సంధ్యారాణి గారు 8.ఆశువు: గుళ్ళపల్లి కాంతికృష్ణ గారు 🙏🌹🙏🌹 🙏🌹🙏 శ్రీగణాధిపతయేనమః శ్రీసరస్వత్యై నమః లక్ష్మీనృహింహ మమదేహి కరావలంబం.. 🙏🙏🙏 శ్రీకారముగాసాగగ సాకారమునందజేయు సాహిత్యముకై ప్రాకటముగతొలిపూజల జేకొను,గణనాథుపదము,చేమోడ్పులివే. 🙏🙏🙏 1) అంశం:వర్ణన పృచ్ఛకుడు: డా.రామక‌ కృష్ణమూర్తి గ్రీష్మ ఋతువును మీ స్వేచ్ఛా వృత్తంలో వర్ణించండి పూరణ: వర్ణన ఏమని జెప్పగ తలచెద నీమంటలనార్పవశమె నేడిట తలచన్ ఏమాయాజాలమిదో ఏ మాత్రమునోపకుంటి మెటు పోదుమొకో... 2) అంశం... ఆశువు గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ వేగంగా వెళుతున్న వాహనం . అందులో కూర్చున్న ప్రయాణీకుల ఆలోచనలు... 🙏🙏🙏🙏 పూరణ: వర్ణన వేగమనగజూడ వేడిగా తలచేరు పడుచు జనులకెల

శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్యపూరణలు - 4

Image
పద్యపూరణలు - 8 తేది: 29-05-2019 శతాధికష్టావధానవేదిక ఈ రోజు పద్యపూరణలు... చేయువారు: శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు అంశాలు: 1.నిషిద్దాక్షరి: గోగులపాటి కృష్ణమోహన్ గారు 2.సమస్య : అష్టకాల విద్యాచరణ్ గారు 3.దత్తపది: సింగీతం నరసింహారావు గారు 4.వర్ణన : గోగులపాటి కృష్ణమోహన్ గారు 5.ఛందోభాషణం: జ్ఙానప్రసూన శర్మ గారు 6 న్యస్థాక్షరి: సరస్వతి రామశర్మ గారు 7.దృశ్యం : సింగీతం సంధ్యారాణి గారు, లక్ష్మీ మదన్ గారు 8.ఆశువు : రామక కృష్ణమూర్తి గారు సమన్వయం గోగులపాటి కృష్ణమోహన్ శుభాశంసలతో.... నిరతము సోత్సాహినియై వరపద్యములల్లుచున్న  భాస్వన్మహిళా ! సరములవోలిక నల్లుచు చిరకీర్తిగ వెల్గుమింక శ్రీయుతదేవీ! డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ. కవుల సమూహానికి నమస్సులు ప్రార్ధన: ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీ సరస్వత్యై నమః ఓం శ్రీ హయగ్రీవాయ నమః శ్రీరంగాపుర సీమయందు జనులశ్రేయంబు పెంపొంద నో రారంగానిను రంగరంగయని చేరంగన్ భవత్పాదముల్ కోరంగాజను భక్తకోటికిలలో కోలాహలంబై కృపా పూరంబౌ భవదృక్కులన్ నిలుపుమా !పుణ్యిత్ములన్ జేయుమా 1) అంశం: వర్ణన గోగులపాటి కృష్ణమోహన్ హనుమత్ జయంతి సందర్భంగా హ

అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారి పద్యపూరణలు

Image
ఈ రోజు పద్యపూరణలు... చేయువారు: అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ  గారు సమన్వయకర్త గోగులపాటి కృష్ణమోహన్ అంశాలు: 1.నిషిద్దాక్షరి : చీదెళ్ళ సీతాలక్ష్మి గారు 2.సమస్య: పద్మ చిగురాల గారు 3.దత్తపది: రామక కృష్ణమూర్తి గారు 4.వర్ణన: సరస్వతి రామశర్మ గారు 5.ఛందోభాషణ: మాడుగుల మురళీధర్ శర్మ గారు 6.అంత్యాదక్షరి : జ్ఙానప్రసూన శర్మ గారు 7.దృశ్యం : మాడుగుల భాస్కర్ శర్మ గారు 8.ఆశువు:చుక్కాయపల్లి శ్రీదేవి గారు ప్రార్థన  ! 🍁🍁🍁 అల పెద్దన్న నుతించినట్టిదగు బాల్యంబైన నీ లీల,నా లలితంబైన యెడంద నిండునటులన్ లాలించి బోధించె ని ర్మలశీలుండగు తాతపాదుడల తన్మాధుర్యమున్ గ్రోలి నే పలుకన్నేర్చితి నా నుతిన్ గొనుము విభ్రాజద్గణాధీశ్వరా! ప్రార్థన! 🍁🍁🍁 అక్షరమాలావర్ణ్యామ్ వీక్షణవిన్యస్తసౌధవిద్యాత్మామ్ ఐక్షవచాపాం వందే సాక్షాత్కామేశమానసాం హంసీమ్! అంశం:దత్తపది పృచ్ఛకుడు: డా.రామక కృష్ణమూర్తి మతి,గతి,క్షితి,రతి-మాతృదేశ వైభవ వర్ణన-మత్తేభ వృత్తంలో చెప్పగలరు 1) పూరణ:  దత్తపది: 🍁🍁🍁 మతిమన్మాతృధరాభిరక్షకులు త్వన్మాహాత్మ్యసంస్థాపకుల్ గతిమద్భద్రసుకృత్యవర్ధనులు నీ కాంతిన్ ప్రచోదింప

శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్యపూరణలు - 3

Image
పద్యపూరణలు... తేది 27-05-2019, సోమవారం చేయువారు: శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు సమన్వయం: గోగులపాటి కృష్ణమోహన్ గారు అంశాలు: 1.నిషిద్దాక్షరి: అష్టకాల విద్యాచరణ్ గారు 2.సమస్య : రామక కృష్ణమూర్తి గారు 3.దత్తపది:  మాడుగుల భాస్కర శర్మ 4.వర్ణన : గోగులపాటి కృష్ణమోహన్ గారు 5.ఛందోభాషణ: గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారు 6 న్యస్థాక్షరి: చీదెళ్ళ సీతాలక్ష్మి గారు 7.దృశ్యం : లక్ష్మీ మదన్ గారు 8.ఆశువు : రమాదేవి కులకర్ణి గారు శ్రీదేవికి అభినందనలు! 🌸🌸🌸🌸🌸🌸🌸 నిరతము కవితాసాధన వరముగ చేపట్టినావు పద్యవిరచనన్ చిరకీర్తినలరుమమ్మా! వరపూరణవిద్యలందు  వాక్ శ్రీదేవీ! ఆశీస్సులతో....... డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ. 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీ సరస్వత్యై నమః ఓం శ్రీ హయగ్రీవాయ‌ నమః సతతము నామ సంస్మరణ  శ్వాసగ ధ్యాసగ నిత్యకృత్యమై గతియిక నీవెయంచు తమకై పరిచర్యలొసంగి భక్తితో నతులిత దివ్యతేజముల యందున నామది‌ నిల్పియుంటి నా జతయును దైవమున్ గురుడు సర్వము నీవనుకొంటి మాధవా 1) అంశం:సమస్య పృచ్ఛకుడు: డా.రామక కృష్ణమూర్తి మగని దూలనాడి మాన్యయయ్యె పూరణ: సమస

ముత్యంపేట గౌరిశంకర శర్మ పద్యపూరణలు

Image
తేది : 26-05-2019, ఆదివారం పద్యపూరణలు చేయువారు: అవధాని బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరిశంకర శర్మ  గారు అంశాలు: 1) వర్ణన చీదెళ్ళ సీతాలక్ష్మి గారు 2) సమస్య సరస్వతి రామశర్మ గారు 3) దత్తపది రామక కృష్ణమూర్తి గారు 4) అశువు గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారు 5) నిషిద్ధాక్షరి: సింగీతం నరసింహారావు గారు 6) ఛందోభాషణం: చుక్కాయపల్లి శ్రీదేవి గారు 7) అంత్యాదక్షరి: 8) శ్లోకానువాదము:  గోగులపాటి కృష్ణమోహన్ గారు, అమరవాది రాజశేఖర శర్మ గారు సమన్వయం గోగులపాటి కృష్ణమోహన్ స్వాగతవచనము అవధానిప్రశంసా! 🌸🌸🌸🌸🌸 గౌరీశంకరకరుణా పాత్రీకృతసాహితీవిభాస్వత్కవయే గౌరీశంకరనామ్నే స్వస్త్యస్తు నవావధానిమణయే నిత్యమ్! అభినందనపురస్సరమ్.... డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ. 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 శ్రీ వినాయక!గణనాధ!చిద్విలాస! నేటియష్టావధానమ్ము మేటిగాను నీవెనడిపింపగాజేసి నిలిచిచెంత భయముతొలగించి నాకిమ్ము జయముదేవ!... ---- ముత్యంపేట గౌరిశంకర శర్మ 1) అంశం.వర్ణన డా.చీదెళ్ల సీతాలక్ష్మి నేటి భోజన వ్యవస్థ..అవస్థ ను స్వేచ్ఛా ఛందము లో వర్ణించండి.... పూరణ : వర్ణన ఎచ్చట చూసినన్ భఫులు ఏర్పడ మింగగలేక కక్కకన్